చంద్ర‌బాబు సోద‌రుడి బ‌ర్త్ డే.. అరుదైన ఫొటోతో విషెస్ చెప్పిన నారా లోకేశ్

  • మార్చి 18న జ‌న్మించిన రామ్మూర్తి నాయుడు
  • చిన్నాన్న‌కు ట్విట్ట‌ర్ ద్వారా విషెస్ చెప్పిన లోకేశ్
  • రామ్మూర్తి చిన్నాన్నా.. అంటూ ఆప్యాయంగా ప‌ల‌క‌రించిన వైనం
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు సోద‌రుడు నారా రామ్మూర్తి నాయుడి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న‌కు పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌ల‌ను తెలిపారు. ఈ సంద‌ర్భంగా త‌న తండ్రి చంద్ర‌బాబుతో రామ్మూర్తి నాయుడు క‌లిసి ఉన్న ఫొటోను జ‌త చేసిన నారా లోకేశ్ చిన్నాన్న‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పారు. లోకేశ్ త‌న ట్వీట్ కు జ‌త చేసిన ఫొటో ఆక‌ట్టుకుంటోంది.

రామ్మూర్తి చిన్నాన్నా..అంటూ ఆప్యాయంగా ప‌లక‌రించిన లోకేశ్.. మీరు మ‌రెన్నో పుట్టిన రోజులను ఆనందంగా జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. త‌న చిన్నాన్న‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలను, సుఖ శాంతులను అనుగ్రహించమని ఆ భగవంతుడుని మనసారా కోరుకుంటున్నానని లోకేశ్ పేర్కొన్నారు.


More Telugu News