‘ది కశ్మీర్ ఫైల్స్’ లింక్స్ పంపి ఖాతాలు ఖాళీ చేస్తున్న నేరగాళ్లు.. అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు
- సినిమాను ఉచితంగా చూడొచ్చంటూ లింకులు
- దానిని ఓపెన్ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళీ
- ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా పోలీసుల అవగాహన
అందివచ్చిన ఏ అవకాశాన్ని సైబర్ నేరగాళ్లు వదులుకోవడం లేదు. బ్యాంక్ వివరాల అప్‌డేట్ పేరుతో వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న నేరగాళ్ల దృష్టి ఇప్పుడు ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై పడింది. ఈ సినిమాను ఉచితంగా చూడొచ్చంటూ లింకులు పంపి స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు.
అప్రమత్తమైన హైదరాబాద్ రాచకొండ పోలీసులు ఇలాంటి లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఢిల్లీ, నోయిడాకు చెందిన హ్యాకర్లు సినిమాను ఉచితంగా చూడొచ్చంటూ లింకులు పంపి ఫోన్లను హ్యాక్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి వాటి బారినపడి ఎవరైనా మోసపోతే 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.