29 అరుదైన కళాఖండాలను భారత్ కు అప్పగించిన ఆస్ట్రేలియా
- నేడు ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ భేటీ
- వర్చువల్ గా సమావేశం
- ద్వైపాక్షిక వాణిజ్యంపై చర్చలు
- భారత్ లో ఆస్ట్రేలియా పెట్టుబడులు
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య సోమవారం ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. వర్చువల్ గా నిర్వహించే ఈ భేటీలో భారత్ లో రూ.1,500 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను మారిసన్ ప్రకటించనున్నారు. ఈ సమావేశానికి ముందు భారత్ కు చెందిన అరుదైన 29 కళాఖండాలను (కళాకృతులు) ఆస్ట్రేలియా అందించడం విశేషం. వీటిని ప్రధాని మోదీ ఆసక్తిగా పరిశీలించారు. వీటిల్లో పెయింటింగ్స్, శిల్పాలు, విష్ణువు, శివుడు, అమ్మవారి కళాఖండాలు, జైన్ సంస్కృతికి చెందిన పెయింటింగ్ లు కూడా ఉన్నాయి.
టెక్నాలజీ, క్రిటికల్ మినరల్స్ తదితర రంగాల్లో ఆస్ట్రేలియా పెట్టుబడులు పెట్టనుంది. ఇరు దేశాల మధ్య ఇది రెండో వర్చువల్ ద్వైపాక్షిక సమావేశం కానుంది. 2020 జూన్ 4న తొలి సమావేశం జరిగింది. ‘‘ప్రధాని మోదీతో వాణిజ్యం, పెట్టుబడుల బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై చర్చించనున్నాం. ఇరు దేశాల పరస్పర ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక వృద్ధిపై దృష్టి సారించనున్నాం’’ అంటూ ఈ సమావేశానికి ముందు స్కాట్ మారిసన్ ప్రకటించారు. ఇరుదేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం దిశగా ఏవైనా అడుగులు పడతాయేమో చూడాలి.