రాజ‌ధాని ర‌క్ష‌ణ కోసం తుపాకీ ప‌ట్టిన టెన్నిస్ స్టార్‌

  • టెన్సిస్‌లో స‌త్తా చాటిన సెర్గీ
  • ఇటీవ‌లే ఆట‌కు గుడ్‌బై
  • కీవ్‌కు ర‌క్ష‌ణ‌గా గస్తీ కాస్తున్న వైనం
ర‌ష్యా దురాక్ర‌మ‌ణ నుంచి త‌మ దేశాన్ని ర‌క్షించుకునేందుకు ఉక్రెయిన్‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు యుద్ధ రంగంలోకి దిగిపోతున్నారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే సినిమా స్టార్లు, వృద్ధులు, మాజీ సైనికులు తుపాకులు చేత‌బ‌ట్టి తాము ఉంటున్న ప్రాంతాల్లోకి ర‌ష్యా సైనికులు చొర‌బ‌డ‌కుండా గ‌స్తీ కాస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఉక్రెయిన్‌కు చెందిన మాజీ టెన్నిస్ క్రీడాకారుడు సెర్గీ స్టాకోవిస్కీ కూడా రంగంలోకి దిగాడు.

ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌కు చెందిన సెర్గీ ప్ర‌స్తుతం తుపాకీ చేత‌బ‌ట్టి త‌మ రాజ‌ధాని న‌గ‌రంలోకి ర‌ష్యా సైనికులు ప్ర‌వేశించ‌కుండా గ‌స్తీ కాస్తున్నారు. గ‌తంలో టెన్నిస్‌లో ఓ వెలుగు వెలిగిన సెర్గీ ఆట‌కు ఈ ఏడాదే గుడ్ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. ర‌ష్యాతో యుద్ధం కార‌ణంగా ఉక్రెయిన్ ఎదుర్కొంటున్న విప‌త్క‌ర ప‌రిస్థితుల నేప‌థ్యంలో త‌న దేశాన్ని, దేశ రాజ‌ధానిని కాపాడుకునేందుకే తాను తుపాకీ ప‌ట్టాన‌ని, నిత్యం ప‌లుమార్లు తుపాకీ చేత‌బ‌ట్టి న‌గ‌రానికి గ‌స్తీ కాస్తున్న‌ట్లు అత‌డు తెలిపాడు.


More Telugu News