చరణ్ సిఫార్స్ తో రంగంలోకి పవర్ఫుల్ విలన్!

  • రిలీజ్ కి రెడీగా 'ఆర్ ఆర్ ఆర్'
  • వచ్చేనెలలో 'ఆచార్య' విడుదల 
  • షూటింగు దశలో శంకర్ సినిమా 
  • విలన్ గా అరవింద్ స్వామి  
చరణ్ నుంచి రావడానికి రెండు భారీ సినిమాలు రెడీ అవుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ఆయన చేసిన 'ఆర్ ఆర్ ఆర్' ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల దర్శకత్వంలో చేసిన 'ఆచార్య' ఏప్రిల్ 29న విడుదల కానుంది. 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ తరువాత 'ఆచార్య' ప్రమోషన్స్ మొదలయ్యేవరకూ ఆయన శంకర్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. 

శంకర్ సినిమాను అత్యధిక భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అవినీతి రాజకీయ నాయకుడే ప్రతినాయకుడు. ఈ పాత్రను శంకర్ చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశాడట. అందువలన ఈ పాత్ర కోసం ఎస్.జె. సూర్యను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అరవింద్ స్వామి పేరు తెరపైకి వచ్చింది. 

గతంలో చరణ్ హీరోగా చేసిన 'ధ్రువ' సినిమాలో అరవింద్ స్వామి విలన్ గా మెప్పించాడు. అందువలన ఆయన అయితే బాగుంటాడని చరణ్ చెప్పడంతో, ఆయనను శంకర్ రంగంలోకి దింపుతున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వాని కనిపించనున్న సంగతి తెలిసిందే.


More Telugu News