కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న‌కు 6.5 కిలోల బంగారు కిరీటం.. ఖ‌ర్చు రూ.4 కోట్లు

  • న‌మూనా కిరీటాన్ని ఆవిష్క‌రించిన మంత్రులు
  • ఆల‌యాల అభివృద్ధికి టీఆర్ఎస్ స‌ర్కారు ప్రాధాన్యం
  • అందులో భాగంగానే కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న‌కు భారీ కిరీటం
తెలంగాణ‌లోని కొముర‌వెల్లిలో వెల‌సిన శ్రీ మ‌ల్లికార్జున స్వామికి రాష్ట్ర ప్ర‌భుత్వ భారీ కిరీటాన్ని అలంక‌రించ‌నుంది. 6.5 కిలోల బంగారంతో ఈ కిరీటాన్ని చేయించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ కిరీటానికి ఏకంగా రూ.4 కోట్ల మేర ఖ‌ర్చు అవుతుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఈ మేర‌కు మంత్రులు హ‌రీశ్ రావు, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిలు మంగ‌ళ‌వారం నాడు హైద‌రాబాద్‌లో కిరీటం న‌మూనాను ఆవిష్క‌రించారు. 

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఆవిర్భ‌వించాక రాష్ట్రంలోని ఆల‌యాల‌ను అభివృద్ధి చేసే దిశ‌గా కేసీఆర్ స‌ర్కారు వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్ప‌టికే యాదాద్రి ఆల‌యాన్ని భారీ ఎత్తున అభివృద్ధి చేశారు. మిగిలిన ఆల‌యాల్లోనూ అభివృద్ధి ప‌నులు సాగుతున్నాయి. తాజాగా కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న‌కు రూ.4 కోట్ల‌తో బంగారు కిరీటాన్ని బ‌హూక‌రించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.


More Telugu News