దీదీ మేనల్లుడికి మరోమారు ఈడీ నోటీసులు
- ఇప్పటికే ఓ దఫా ఈడీ విచారణకు అభిషేక్
- తాజాగా మరోమారు నోటీసులు జారీ చేసిన ఈడీ
- ఈ నెల 29న విచారణకు రావాలంటూ ఆదేశం
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోమారు నోటీసులు జారీ చేసింది. నాలుగు రోజుల క్రితం ఈడీ విచారణకు హాజరైన ఆయనను మరోమారు ఈ నెల 29న, తమ ముందు హాజరు కావాలంటూ ఈడీ తన తాజా నోటీసుల్లో పేర్కొంది. బెంగాల్లో చోటుచేసుకున్న బొగ్గు కుంభకోణానికి సంబంధించి విచారించాల్సి ఉందని ఈడీ ఆ నోటీసుల్లో తెలిపింది.
మనీ ల్యాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఈడీ జారీ చేసిన నోటీసులకు అనుగుణంగా సోమవారం నాడు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లిన అభిషేక్ బెనర్జీని అధికారులు ఏకంగా 8 గంటలకు పైగా విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణపైనే తృణమూల్ కాంగ్రెస్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న తరుణంలో మరోమారు అభిషేక్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.