అనూ ఇమ్మాన్యుయేల్ కి 'రావణాసుర' టీమ్ విషెస్!
- 'మజ్ను' సినిమాతో అనూ పరిచయం
- గ్లామరస్ హీరోయిన్ గా యూత్ లో క్రేజ్
- 'రావణాసుర'లో రవితేజ జోడీగా ఛాన్స్
- దర్శకుడిగా ప్రశాంత్ వర్మ
అందం .. అభినయంతో పాటు సక్సెస్ కూడా ఉన్నప్పుడే హీరోయిన్స్ నిలదొక్కుకుంటారు. అందానికీ .. అభినయానికి అదృష్టం తోడైతే సక్సెస్ కూడా చేతికి చిక్కుతుంది. అలాంటి సక్సెస్ లేని కారణంగా వెనకబడిపోయిన కథానాయికలలో అనూ ఇమ్మాన్యుయేల్ ఒకరుగా కనిపిస్తుంది. ఆకర్షణీయమైన రూపంతో .. చూపులతో అనూ ఇట్టే ఆకట్టుకుంటుంది.
అలాంటి అనూ ఇమ్మాన్యుయేల్ 'మజ్ను' సినిమాతో నానీకి జోడీగా పరిచయమైంది. పవన్ తో 'అజ్ఞాతవాసి' .. బన్నీతో 'నా పేరు సూర్య' .. మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' వంటి సినిమాలు చేసినప్పటికీ అవి ఆమె కెరియర్ కి ఎంతమాత్రం హెల్ప్ కాలేకపోయాయి. దాంతో అవకాశాలు మరింతగా మందగించాయి.
ఈ నేపథ్యంలోనే ఆమె రవితేజ సరసన నాయికగా 'రావణాసుర' సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజున అనూ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా టీమ్ ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె స్టిల్ ఒకటి వదిలింది. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.