లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 350 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 103 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 3 శాతానికి పైగా పెరిగిన హెచ్డీఎఫ్సీ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ క్రమంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 350 పాయింట్లు లాభపడి 57,943కి చేరుకుంది. నిఫ్టీ 103 పాయింట్లు పెరిగి 17,325 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (3.36%), భారతి ఎయిర్ టెల్ (2.89%), అల్ట్రా సిమెంట్ (2.70%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.40%), డాక్టర్ రెడ్డీస్ (1.09%).
టాప్ లూజర్స్:
ఐటీసీ (-0.99%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.59%), మారుతి (-0.52%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.49%), టాటా స్టీల్ (-0.34%).