కొత్త జిల్లాలపై 90 శాతం విజ్ఞప్తులను సీఎం జగన్ పరిష్కరించారు: ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్

  • ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు
  • రెండ్రోజుల్లో తుది నోటిఫికేషన్
  • ఏప్రిల్ 4న కొత్త జిల్లాలను ప్రారంభించనున్న సీఎం జగన్
  • ఆపై కేంద్ర ప్రణాళిక శాఖకు కొత్త జిల్లాల జాబితా
ఏపీలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలపడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వివరాలు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై రెండ్రోజుల్లో తుది నోటిఫికేషన్ వస్తుందని వెల్లడించారు. ఏప్రిల్ 4న సీఎం జగన్ కొత్త జిల్లాలను ప్రారంభిస్తారని తెలిపారు. ఆ తర్వాత కొత్త జిల్లాల జాబితాను కేంద్ర ప్రణాళిక శాఖకు పంపుతామని పేర్కొన్నారు. 

పూర్తి శాస్త్రీయ విధానంలో, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాల పునర్ విభజన చేపట్టినట్టు విజయ్ కుమార్ వివరించారు. కాగా, జిల్లాల విభజనపై ప్రజల నుంచి 17,500కి పైగా సూచనలు, అభ్యంతరాలు రాగా, 284 అంశాలపై విజ్ఞప్తులు అందాయని తెలిపారు. సీఎం జగన్ 90 శాతం అంశాలపై సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.


More Telugu News