ధోనీ తీరును తప్పుబట్టిన అజయ్ జడేజా!
- లక్నోతో మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ
- ఇలా చేయడం రవీంద్ర జడేజా ఆత్మవిశ్వాసానికి దెబ్బే
- ధోనీ అలా వ్యవహరించి ఉండకూడదన్న అజయ్ జడేజా
ఈ ఐపీఎల్ సీజన్‌లో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ..తన చేతిలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాయకత్వ బాధ్యతలను ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఐపీఎల్‌లో ఇప్పటిదాకా జడేజా నాయకత్వంలో రెండు మ్యాచ్‌ల్లో సీఎస్కే ఓటమిపాలైంది. మొన్నటి లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా తాను కెప్టెన్‌ను కాదన్న విషయాన్ని ధోనీ మరిచిపోయినట్టుగా కనిపించాడు. జడేజా మ్యాచ్‌లో ఉన్నా... బౌలర్ల ఎంపిక, ఫీల్డింగ్ స్థానాల మార్పు వంటి వాటిల్లో ధోనీ మితిమీరి మరీ జోక్యం చేసుకున్నట్లుగా కనిపించింది.
ఈ తరహా ధోని వైఖరిని టీమిండియా జట్టు మాజీ ఆటగాడు అజయ్ జడేజా తీవ్రంగా తప్పుబట్టాడు. కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా నేర్చుకునేందుకు అవకాశం కల్పించాలని అతడు అభిప్రాయపడ్దాడు. ధోనీకి తనకు మించిన అభిమాని లేడని చెప్పిన అజయ్.. కెప్టెన్సీ వదిలాక కూడా ఇంకా కెప్టెన్‌గానే వ్యవహరించిన ధోనీ తీరు మాత్రం తనకు నచ్చలేదని చెప్పాడు. ఈ తరహా ధోనీ వైఖరి వల్ల కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రవీంద్ర జడేజా ఆత్మ విశ్వాసం దెబ్బ తిని ఉంటుందని అజయ్ జడేజా వ్యాఖ్యానించాడు.