తాడేపల్లిలో ఉగాది వేడుకలు.. సతీసమేతంగా హాజరైన సీఎం జగన్
- తాడేపల్లిలో ఉగాది వేడుకలు
- హాజరైన సీఎం జగన్ దంపతులు
- పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైసీపీ నేతలు
తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఏపీలో ప్రభుత్వం తరఫున అధికారిక వేడుకలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై ప్రారంభమైన ఈ వేడుకలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన అర్ధాంగి వైఎస్ బారతితో కలిసి హాజరయ్యారు. తెలుగు సంప్రదాయ వస్త్రధారణలో కనిపించిన సీఎం దంపతులు అందరినీ ఆకట్టుకున్నారు.
వేడుకల్లో భాగంగా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళి అర్పించారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న చిన్నారులతో ముచ్చటించిన జగన్.. పంచాంగ శ్రవణంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీకి చెందిన కీలక నేతలు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.