'బింబిసార' రిలీజ్ డేట్ ఖరారు!

  • 'బింబిసార'గా కల్యాణ్ రామ్ 
  • చారిత్రక నేపథ్యంతో కూడిన కథ
  • మోడ్రన్ లుక్ తోను కనిపించనున్న కళ్యాణ్ రామ్ 
  • ఆగస్టు 5వ తేదీన విడుదల
ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై చారిత్రక అంశాలు చోటుచేసుకుంటున్నాయి. చరిత్రలో ఎక్కడికో వెళ్లి అక్కడి అంశాలతో ఆసక్తిని పెంచుతున్నారు. అందుకు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. అలా కల్యాణ్ రామ్ కూడా 'బింబిసార' సినిమాతో చరిత్రను టచ్ చేశాడు. ఆయన సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. 

ఈ సినిమా విడుదల తేదీని కొంతసేపటి క్రితం ప్రకటించారు. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా  తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ రాజుగా మాత్రమే కాకుండా మోడ్రన్ లుక్ తోను కనిపించనున్నాడనే టాక్ వినిపించింది. అది నిజమే అనుకునేలా తాజా పోస్టర్ ఉంది.

వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణ్ సరసన నాయికలుగా కేథరిన్ -  సంయుక్త మీనన్ నటించారు. కీరవాణి  -చిరంతన్ భట్ కలిసి పనిచేసిన ఈ సినిమా కోసం, కల్యాణ్ రామ్ ఒక రేంజ్ లో ఖర్చు చేశాడని అంటున్నారు. కల్యాణ్ రామ్ చేసిన ఈ ప్రయోగం ఎంతవరకూ ఫలిస్తుందనేది చూడాలి.


More Telugu News