బట్లర్ సూపర్ శతకం... రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు

  • డీవై పాటిల్ స్టేడియంలో ముంబయితో రాజస్థాన్ పోరు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 రన్స్ చేసిన రాజస్థాన్
  • 68 బంతుల్లో 100 పరుగులు చేసిన బట్లర్
ముంబయి ఇండియన్స్ తో పోరులో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ అద్భుత సెంచరీ సాధించాడు. 68 బంతుల్లో 100 పరుగులు చేశాడు. బట్లర్ స్కోరులో 11 ఫోర్లు, 5 భారీ సిక్సులు ఉన్నాయంటే, అతడి దూకుడు ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. బట్లర్ సెంచరీ సాయంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. 

కెప్టెన్ సంజు శాంసన్ 21 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 30 పరుగులు చేయగా, హెట్మెయర్ 14 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు నమోదు చేశాడు. అయితే చివర్లో వడివడిగా వికెట్లు పడడంతో రాజస్థాన్ రాయల్స్ 200 మార్కుకు చేరువలో నిలిచిపోయింది. ముంబయి బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3, టైమల్ మిల్స్ 3, పొలార్డ్ 1 వికెట్ తీశారు.


More Telugu News