పబ్ కేసులో తన కుమారుడి పేరు వినిపించడంపై కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ స్పందన

  • హైదరాబాద్ లో పుడింగ్ మింక్ పబ్ పై దాడులు
  • పబ్ లో పలువురు ప్రముఖుల పిల్లలు!
  • తన కుమారుడు బర్త్ డే వేడుకలకు వెళ్లాడన్న అంజన్
  • పబ్ లు మూసేయించాలని డిమాండ్
హైదరాబాదు బంజారాహిల్స్ లోని పుడింగ్ మింక్ పబ్ పై పోలీసులు దాడి చేయగా, డ్రగ్స్ పట్టుబడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖులు పట్టుబడడం తెలిసిందే. అయితే, పబ్ కేసు వ్యవహారంలో తన కుమారుడు అరవింద్ పేరు వినిపించడంపై కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్పందించారు. 

తన కుమారుడు స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలకు వెళ్లాడని వెల్లడించారు. బర్త్ డే పార్టీకి వెళితే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని ఫైవ్ స్టార్ హోటళ్లలో పబ్బులు ఉంటున్నాయని, బర్త్ డే వేడుకలకు ఫైవ్ స్టార్ హోటళ్లకు వెళితే, పబ్బులపై దాడుల సందర్భంగా బర్త్ డే వేడుకలకు వెళ్లిన వాళ్లను కూడా తీసుకెళుతున్నారని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుగుతుండడంతో ఓర్వలేక తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబానికి ఇప్పటిదాకా ఎలాంటి చెడ్డపేరు లేదని అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాదు నగరంలో ఉన్న పబ్ లను మూసివేయాలని, లిక్కర్ బ్యాన్‌‌ చేయాలని డిమాండ్ చేశారు. పబ్ వ్యవహారంలో వాస్తవాలు తేల్చాలని కోరారు.


More Telugu News