గని సినిమాకు టికెట్ ధరలను తగ్గించిన తెలంగాణ ప్రభుత్వం
- శుక్రవారం విడుదలవుతున్న 'గని'
- హీరో, హీరోయిన్లుగా వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్
- మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ. 200 ప్లస్ జీఎస్టీ
కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ మళ్లీ కళకళలాడుతోంది. థియేటర్లలో సైతం సినిమాలు విడుదల అవుతూ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా తమ వంతుగా సినీ పరిశ్రమకు అండగా నిలుస్తున్నాయి.
ఇటీవల విడుదలైన 'ఆర్ఆర్ఆర్' చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. టికెట్ ధరలను పెంచుకోవడానికి ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించాయి. మరోవైపు వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గని' చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
అయితే, తెలంగాణలో పెరిగిన టికెట్ ధరలను సినీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగ్గించింది. మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 200 ప్లస్ జీఎస్టీ... సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి రూ. 150గా నిర్ణయించింది. టికెట్ ధరలను తగ్గిస్తే ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని నిర్మాతలు కూడా భావిస్తున్నారు.