కొత్త జిల్లాల‌కు కేంద్రీయ విద్యాల‌యాలు ఇవ్వండి.. రాజ్య‌స‌భ‌లో విజ‌య‌సాయిరెడ్డి డిమాండ్‌

  • కొత్త జిల్లాల ఏర్పాటును ప్ర‌స్తావించిన సాయిరెడ్డి
  • ఒక్కో కొత్త జిల్లాకు కేంద్రీయ విద్యాల‌యం ప్ర‌క‌టించాల‌ని డిమాండ్‌
  • కేంద్రానికి రాష్ట్రం పూర్తి స‌హ‌కారం అందిస్తుంద‌ని వెల్ల‌డి
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటైపోయిన సంగతి తెలిసిందే. ఈ విష‌యంపై ఇప్ప‌టికే మంగ‌ళ‌వారం నాడు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని క‌లిసిన సీఎం జ‌గ‌న్ పూర్తి వివ‌రాలు అంద‌జేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో జిల్లాల సంఖ్య 26కు చేరింది. కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ప్ర‌తి జిల్లాలో ఓ కేంద్రీయ విద్యాల‌యం ఉండాలి. ఇదే అంశాన్ని రాజ్య‌స‌భ‌లో ప్ర‌స్తావించిన వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి.. కొత్త జిల్లాల‌కు కేంద్రీయ విద్యాల‌యాల‌ను కేటాయించాల‌ని డిమాండ్ చేశారు.

బుధ‌వారం నాటి పార్ల‌మెంటు స‌మావేశాల్లో భాగంగా రాజ్య‌స‌భ‌లో ఈ అంశాన్ని ప్ర‌స్తావించిన సాయిరెడ్డి.. ఏపీలో కొత్త‌గా ఏర్పాటైన కొత్త జిల్లాల‌కు కేంద్రీయ విద్యాల‌యాల‌ను కేటాయించాల‌ని డిమాండ్ చేశారు. కేంద్రీయ విద్యాల‌యాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వానికి రాష్ట్ర ప్ర‌భుత్వం పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందించేందుకు సిద్ధంగా ఉంద‌ని కూడా సాయిరెడ్డి తెలిపారు.


More Telugu News