విద్యుత్ సంక్షోభానికి వైసీపీ అనాలోచిత విధానాలే కారణం: పవన్ కల్యాణ్
- పల్లెల్లో 14 గంటలు, పట్టణాల్లో 8 గంటల కోతలు
- మొబైల్ ఫోన్ వెలుగులో ప్రసవాలు
- పవర్ హాలిడేతో పారిశ్రామిక అభివృద్ధికి విఘాతమన్న పవన్
ఏపీలో విద్యుత్ సంక్షోభానికి వైసీపీ ప్రభుత్వ అనాలోచిత విధానాలే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో అమలు అవుతున్న విద్యుత్ కోతలు, ఫలితంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్... జగన్ సర్కారు తీరును తూర్పారబ్టటారు.ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ ఓ ప్రకటనను విడుదల చేశారు.
పల్లెల్లో 14 గంటలు, పట్టణాల్లో 8 గంటలకు తగ్గకుండా విద్యుత్ కోతలు అమలు చేస్తున్న వైసీపీ సర్కారు... అనధికారికంగా కోతలను మరింత మేర పెంచి అమలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పవన్ ఆ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యుత్ కోతల నేపథ్యంలో ఆసుపత్రుల్లో మొబైల్ ఫోన్ వెలుగులో ప్రసవాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఏ మాదిరిగా ఉందో అర్థమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పవర్ హాలిడే ప్రకటనతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలుగుతోందన్నారు. ఈ ఫలితంగా 36 లక్షల మంది కార్మికులకు ఉపాధి దూరమవుతోందని పవన్ అన్నారు.