ఏపీలో మొట్టమొదటి మొబైల్ సినిమా థియేటర్... ఎలా ఉందో చూడండి!
- తూ.గో.జిల్లా రాజానగరం వద్ద మొబైల్ థియేటర్
- థియేటర్ సామర్థ్యం 120 సీట్లు
- ఆచార్య సినిమాతో ఓపెనింగ్
- అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే థియేటర్
ఏపీలో వినూత్న రీతిలో మొట్టమొదటిసారిగా మొబైల్ సినిమా థియేటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం వద్ద పిక్చర్ డిజిటల్స్ అనే సంస్థ ఈ మొబైల్ థియేటర్ ను రూపొందిస్తోంది. ఎక్కడ్నించి ఎక్కడికైనా తరలించే వీలున్న ఈ థియేటర్ ను మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో ప్రారంభించనున్నారు. దీన్ని ఓ ట్రక్కులో తరలించవచ్చు.
దీన్ని అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు తగిన విధంగా రూపొందించారు. అగ్నిప్రమాదాలను సైతం ఇది తట్టుకుంటుంది. దీనికి సంబంధించిన టెంట్ ను గాలితో నింపుతారు. ఇది ఏసీ థియేటర్ కాగా, దీని సామర్థ్యం 120 సీట్లు. ఏపీలో ఈ తరహా థియేటర్లలో ఇదే మొదటిది. రాజానగరం వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న హాబిటేట్ ఫుడ్ కోర్టు ఆవరణలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.
.