ముందస్తు ముచ్చటే లేదు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బాల్క సుమన్ వ్యాఖ్య
- టీవీ డిబేట్లో పాల్గొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
- ముందస్తు ఎన్నికలన్న ప్రచారాన్ని కొట్టిపారేసిన వైనం
- నిర్ణీత కాల వ్యవధి ప్రకారమే ఎన్నికలన్న సుమన్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ప్రచారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కీలక వ్యాఖ్య చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ముందస్తు ముచ్చటే లేదంటూ ఆయన తేల్చి పారేశారు. ఈ మేరకు నేటి సాయంకాలం ఓ టీవీ ఛానెల్ డిబేట్కు హాజరైన ఆయన గతంలో మాదిరే టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకే మొగ్గు చూపుతోందన్న ప్రచారంపై స్పందిస్తూ పై వ్యాఖ్య చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమన్న బాల్క సుమన్.. నిర్ణీత వ్యవధి ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.