హిజాబ్‌తోనే ప‌రీక్షకు!.. అనుమ‌తించ‌క‌పోవ‌డంతో వెనుదిరిగిన ఉడిపి విద్యార్థినులు!

  • హిజాబ్ కోసం పోరాడుతున్న ఉడిపి విద్యార్థినులు
  • పీయూసీ ప‌రీక్ష రాసేందుకు హిజాబ్‌తోనే వ‌చ్చిన వైనం
  • అనుమ‌తించని పాఠ‌శాల యాజ‌మాన్యం
  • ప‌రీక్ష రాయ‌కుండానే వెనుదిరిగిన విద్యార్థినులు
క‌ర్ణాట‌క‌లోని ఉడిపిలో రేకెత్తిన హిజాబ్ వివాదం దేశ‌వ్యాప్తంగా ఏ మేర చ‌ర్చ‌కు తెర తీసిందో తెలిసిందే. విద్యాల‌యాల‌కు కూడా హిజాబ్‌తోనే వ‌స్తామంటూ ఉద్య‌మిస్తున్న ఉడిపి విద్యార్థులు తాజాగా ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌లేదు. పీయూసీ ప‌రీక్ష‌లు రాసేందుకు శుక్ర‌వారం ఆ విద్యార్థులు హిజాబ్‌తోనే విద్యాల‌యానికి వ‌చ్చారు. అయితే హిజాబ్‌తో విద్యాల‌యంలోకి ప్ర‌వేశానికి అనుమ‌తి లేద‌ని పాఠ‌శాల యాజ‌మాన్యం తేల్చి చెప్ప‌డంతో సదరు విద్యార్ధినులు ప‌రీక్ష రాయ‌కుండానే వెనుదిరిగారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయాయి.


More Telugu News