ఏపీ హైకోర్టు సీజేతో సీఎం జగన్ సమావేశం
- సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రాతో తొలిసారి భేటీ అయిన సీఎం
- స్టేట్ గెస్ట్ హౌస్ లో సమావేశం
- పలు అంశాలపై చర్చ
ఏపీ సీఎం జగన్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రాతో భేటీ అయ్యారు. ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా వచ్చాక సీఎం జగన్ ఆయనను కలవడం ఇదే తొలిసారి. వీరి భేటీకి స్టేట్ గెస్ట్ హౌస్ వేదికగా నిలిచింది. సీఎం జగన్, సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రాల సమావేశం దాదాపు గంటపాటు సాగింది.
ఏపీ హైకోర్టు నూతన భవన నిర్మాణ పనులు, 2016లో నాటి సీఎంలు, హైకోర్టు సీజేల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతి, కోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఈ-కోర్టుల వ్యవస్థ, న్యాయవ్యవస్థలో ఉద్యోగ ఖాళీల భర్తీ, పెండింగ్ కేసుల పరిష్కారం తదితర అంశాలు వీరి భేటీలో చర్చకు వచ్చాయి. అంతేకాదు, ఈ నెల 30న ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగే ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సమావేశం అజెండాపైనా చర్చించారు.