పెట్రో ధరల పెరుగుదలకు రాష్ట్రాలే కారణం: ప్రధాని నరేంద్ర మోదీ
- రాష్ట్రాలు వ్యాట్ తగ్గించడం లేదన్న ప్రధాని
- కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా ఫలితం లేదని వ్యాఖ్య
- వ్యాట్‌ను రాష్ట్రాలు తగ్గిస్తేనే పెట్రో ధరలు తగ్గుతాయన్న మోదీ
దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగానే దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా కట్టడికి సంబంధించి బుధవారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ భేటీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలోనే మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ "పెట్రోల్ ధరలు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణం. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గిస్తేనే పెట్రోల్ ధరలు తగ్గుతాయి. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే ధరలు తగ్గుతాయి. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా...రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించడం లేదు. తెలంగాణ, ఏపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించడం లేదు. వ్యాట్ తగ్గించని కారణంగానే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలి" అని అన్నారు.