పంట పొలాల్లో రేవంత్ రెడ్డి... రాహుల్ సభకు రావాలంటూ రైతులకు ఆహ్వానం
- రాహుల్ సభ జనసమీకరణలో రేవంత్‌రెడ్డి
- నాగార్జున సాగర్ పరిధిలో పర్యటన
- పంట పొలాల్లో అన్నదాతలతో మాటా మంతి
- రాహుల్ సభ ఉద్దేశాలను వివరించిన టీపీసీసీ చీఫ్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. వచ్చే నెల 6న వరంగల్‌లో జరగనున్న రాహుల్ గాంధీ సభకు జన సమీకరణ కోసం పలు జిల్లాల్లో రేవంత్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనల్లో భాగంగానే శుక్రవారం నాడు నల్లొండ జిల్లా పర్యటనకు వచ్చిన రేవంత్ రెడ్డి నాగార్జున సాగర్ పరిధిలోని పంట పొలాల్లో కనిపించారు. పొలాల్లో పనుల్లో నిమగ్నమైన రైతులతో మాట్లాడిన రేవంత్... రాహుల్ సభకు రావాలంటూ వారికి ఆహ్వానం పలికారు.
ఇలా పంట పొలాల్లో అన్నదాతలతో కలిసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి చెందిన ఓ వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో రైతు దంపతులతో మాట్లాడుతున్న రేవంత్...వరంగల్‌లో రాహుల్ గాంధీ సభను ఎందుకు నిర్వహిస్తున్నామో తెలిపారు. అటు కేంద్రంలో నరేంద్ర మోదీ, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాయని, వాటిపై గట్టిగా ప్రశ్నించేందుకే రాహుల్ గాంధీ సభ పెడుతున్నట్లు చెప్పారు. ఈ సభకు రావాలని రేవంత్ అనగానే... ఇలాంటి సభ ఎక్కడ పెట్టినా వస్తామని అన్నదాత బదులిచ్చారు.