వాహ‌నాల‌తో ర‌ద్దీగా ఉన్న రోడ్డు మ‌ధ్య‌లో కూర్చొని టిఫిన్ తిన్న వ్య‌క్తి.. వీడియో వైర‌ల్

  • బెంగ‌ళూరులోని బసవేశ్వర నగర్లో ఘ‌ట‌న‌
  • దోశ, వాట‌ర్ తెచ్చుకుని రోడ్డుపై కూర్చొని తిన్న వైనం
  • వాహ‌నాలు పక్క నుంచి వెళ్లాల‌ని సూచించిన తాగుబోతు
ఓ వ్య‌క్తి టిఫిన్, వాట‌ర్ బాటిల్ ప‌ట్టుకుని న‌డిరోడ్డుపైకి వ‌చ్చి, అక్క‌డే కూర్చొని తిన్నాడు. ర‌ద్దీగా ఉన్న ఆ రోడ్డుపై అత‌డు ప్ర‌వ‌ర్తించిన తీరు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగళూరులోని బసవేశ్వర నగర్లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతోంది. 

ఆ స‌మ‌యంలో ఆ వ్య‌క్తి మ‌ద్యం తాగి ఉన్నాడు. దోశ, వాటర్ బాటిల్ తో రోడ్డు మధ్యలో కూర్చుని, చాలా సేపు దోశ తిన్నాడు. వాహ‌నాలు పక్క నుంచి వెళ్లాల‌ని, టిఫిన్ తింటోన్న స‌మ‌యంలో త‌న‌ను డిస్ట‌ర్బ్ చేయ‌కూడ‌ద‌ని అత‌డు వాహ‌న‌దారుల‌కు సూచించాడు.   

         


More Telugu News