సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇలాంటి వదంతులు సాధారణమే.. సెలబ్రిటీలు అన్న తర్వాత త‌ప్ప‌దు: యాంక‌ర్ సుమ‌

  • రాజీవ్ తో పెళ్లయి 23 ఏళ్లు అవుతోందన్న సుమ‌
  • చాలా సంతోషంగా ఉన్నామ‌ని వ్యాఖ్య‌
  • త‌మ‌పై వ‌దంతులు వచ్చిన‌ప్పుడు కొన్ని ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తాన‌న్న యాంక‌ర్
  • వాటి ద్వారా ఆ వ‌దంతుల‌కు కొంతవరకైనా చెక్‌ పెట్టే ప్రయత్నం చేశానని వివ‌ర‌ణ‌
ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జయమ్మ పంచాయితీ' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త‌న భ‌ర్త రాజీవ్ క‌న‌కాల‌తో విభేదాలు వ‌చ్చాయంటూ వ‌స్తోన్న వార్త‌ల‌పై స్పందించింది. త‌మ‌ పెళ్లయి 23 ఏళ్లు అవుతోంద‌ని, తాము చాలా సంతోషంగా ఉన్నామ‌ని చెప్పింది. 

త‌మ‌పై వ‌దంతులు వచ్చినప్పుడు తాను త‌మ వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తాన‌ని తెలిపింది. వాటి ద్వారా ఆ వ‌దంతుల‌కు కొంతవరకైనా చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తానని వివ‌రించింది. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇలాంటి వదంతులు సాధారణమేన‌ని, సెలబ్రిటీలు అన్న తర్వాత ఇలాంటివి తప్పదని వ్యాఖ్యానించింది.

అటువంటి వాటి వల్ల మానసికంగా బాధ కలిగినా అందుకు అలవాటుపడి పోయామ‌ని తెలిపింది. కాగా, రాజీవ్‌తో సుమ‌కు విభేదాలు వ‌చ్చిన కార‌ణంగా వారు, వేర్వేరుగా ఉంటున్నార‌ని, విడాకులు కూడా తీసుకోవాల‌నుకున్నార‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి.


More Telugu News