రాహుల్ సభ కోసం కేసీఆర్ ను కలుస్తా: జగ్గారెడ్డి

  • రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్శిటీ కార్యక్రమానికి అనుమతి నిరాకరణ
  • కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరతానన్న జగ్గారెడ్డి
  • ఎర్రబెల్లి ఒక చిల్లర మంత్రి అని వ్యాఖ్య
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో రాహుల్ సభను నిర్వహించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ యత్నిస్తోంది. యూనివర్శిటీ వీసీ నుంచి ఈ కార్యక్రమానికి ఇంత వరకు అనుమతి రాలేదు. హైకోర్టు కూడా వీసీదే తుది నిర్ణయమని తెలిపింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్శిటీ టూర్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తానని జగ్గారెడ్డి చెప్పారు. దీని కోసం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరతానని తెలిపారు. లేఖ కూడా రాస్తానని తెలిపారు. ఇదే సమయంలో మంత్రి ఎర్రబెల్లిపై జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో తెలియని వ్యక్తి ఎర్రబెల్లి అని విమర్శించారు. సమైక్యవాది అయిన ఎర్రబెల్లి మంత్రి కావడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎర్రబెల్లి ఒక చిల్లర మంత్రి అని... ఆయనా రాహుల్ గురించి మాట్లాడేది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News