కేటీఆర్ ట్వీట్‌కు ఘాటు రిప్లై ఇచ్చిన రేవంత్ రెడ్డి

  • కేటీఆర్ దృష్టిలో తెలంగాణ టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చన్న రేవంత్ 
  • మా దృష్టిలో అమ‌ర‌వీరుల త్యాగ‌ఫ‌ల‌మే తెలంగాణ‌ అని వ్యాఖ్య 
  • కేటీఆర్‌ టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా దానిని సృష్టించిందీ కాంగ్రెస్సేన‌న్న రేవంత్‌
కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ సంధించిన ట్వీట్‌కు టీపీసీసీ చీఫ్‌, మ‌ల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటు రిప్లై ఇచ్చారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్‌ను కోట్ చేస్తూ దానికి రీ ట్వీట్ పోస్ట్ చేశారు. తెలంగాణ‌కు టూరిస్టులు వ‌స్తుంటారు, వెళుతుంటారు అంటూ కేటీఆర్ శుక్ర‌వారం రాత్రి ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ ట్వీట్‌పై వేగంగా స్పందించిన రేవంత్ రెడ్డి... కేటీఆర్‌ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చంటూ కీల‌క వ్యాఖ్య చేశారు. తెలంగాణ‌ను కేటీఆర్ టూరిస్ట్ ప్లేస్‌గా ప‌రిగ‌ణిస్తుంటే... తాము మాత్రం ఈ రాష్ట్రం అమ‌ర వీరుల త్యాగ‌ఫ‌లంగానే భావిస్తున్నామ‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం తెలంగాణ అని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌ వక్రదృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా… దానిని సృష్టించింది కూడా కాంగ్రెస్సేన‌ని ఘాటు రిప్లై ఇచ్చారు.


More Telugu News