మిష‌న్ భ‌గీర‌థ‌పై ద‌ర్యాప్తున‌కు కేంద్రం ఆదేశం

  • ద‌ర్యాప్తున‌కు ప్ర‌త్యేకాధికారిని నియ‌మించిన కేంద్రం
  • జ‌ల జీవ‌న్ క‌మిష‌న్ స‌ర్వే ఆధారంగా ఫిర్యాదు
  • కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ‌కు చేరిన‌ ఫిర్యాదుతో ద‌ర్యాప్తు
తెలంగాణ‌లో ఇంటింటికీ తాగు నీటి సరఫరా కోసం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన మిష‌న్ భ‌గీర‌థ‌పై విచార‌ణ చేప‌ట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఈ ద‌ర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్ర‌త్యేకాధికారిని నియ‌మించింది. ఈ మేర‌కు సోమ‌వారం కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది

  మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కానికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున నిధులు వ్య‌యం చేసింది. అయితే జ‌ల జీవ‌న్ క‌మిష‌న్ ఇటీవ‌లే ఈ ప‌థ‌కం అమ‌లు తీరుపై స‌ర్వే నిర్వ‌హించింది. ఈ క‌మిష‌న్ స‌ర్వే రిపోర్టు ఇటీవ‌లే కేంద్రానికి అంద‌గా... ఆ నివేదిక ఆధారంగా ప‌థ‌కంపై కేంద్ర జ‌ల వ‌న‌రుల మంత్రిత్వ శాఖ‌కు ఓ ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును ఆధారం చేసుకుని ప‌థ‌కంపై దర్యాప్తున‌కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News