'సలార్' షూటింగ్ రెండో షెడ్యూల్ తొలిరోజే షాక్.. ప్రభాస్ పిక్స్ లీక్!

  • ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 'సలార్'
  • రెండో షెడ్యూల్ షూటింగ్ ఈరోజు ప్రారంభం
  • ప్రభాస్, సెట్ ఫొటోలు లీక్ అయిన వైనం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'కేజీఎఫ్' సినిమాలతో దేశ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 'సలార్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈరోజు రెండో షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమయింది. అయితే, రెండో షెడ్యూల్ తొలి రోజే చిత్ర యూనిట్ కి షాక్ తగిలింది. షూటింగ్ స్పాట్ నుంచి ప్రభాస్ ఫొటోలను ఎవరో షూట్ చేసి, లీక్ చేశారు. 

ప్రభాస్ ఓ అమ్మాయితో మాట్లాడుతున్న ఫొటో, కుర్చీలో కూర్చున్న ఫొటో, సెట్ కు సంబంధించిన ఒక ఫొటో లీక్ అయ్యాయి. సెట్ కు సంబంధించిన ఫొటోను చూస్తే సినిమా చాలా వయొలెంట్ గా ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. 'కేజీఎఫ్'ను నిర్మించిన హంబాలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. 


More Telugu News