ఒక సినిమా ఫ్లాప్ అయితే.. ఇంకో సినిమా వాళ్లు ఆనందపడుతున్నారు: అలీ సంచలన వ్యాఖ్యలు
- పక్కనోళ్ల సినిమా ఫ్లాప్ కావాలని కోరుకునే వాళ్లు టాలీవుడ్ లో ఉన్నారన్న అలీ
- సినిమా బాగోలేదని పనికట్టుకుని ప్రచారం చేసేవాళ్లు ఉన్నారంటూ కామెంట్
- చెన్నైలో ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఇలాంటి నెగెటివ్ ఆలోచనలు ఉండేవి కాదని వెల్లడి
పక్కనోళ్ల సినిమా ఫ్లాప్ కావాలని కోరుకునే జనాలు టాలీవుడ్ లో ఉన్నారని సినీ నటుడు అలీ అన్నారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇంకో సినిమా వాళ్లు చంకలు గుద్దుకోవడం ఏమిటో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ధోరణి చాలా ఎక్కువయిందని తెలిపారు. ఇలాంటి దురాలోచనలను మానుకోవాలని అన్నారు. పక్కనోళ్లు మంచిగా ఉండాలని కోరుకుంటే... అంతకు మించిన మంచి మీక్కూడా జరుగుతుందని చెప్పారు.
బాగున్న సినిమాను కూడా బాగోలేదని కొందరు పనికట్టుకుని ప్రచారం చేస్తున్నారని అలీ మండిపడ్డారు. అలా ప్రచారం చేస్తున్న వాళ్లు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. గతంలో చెన్నైలో తెలుగు ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఇలాంటి నెగెటివ్ ఆలోచనలు ఉండేవి కాదని అన్నారు.
ఇక 'ఎఫ్ 3' సినిమాకు నిన్న కూడా హౌస్ ఫుల్ కలెక్షన్ వచ్చాయని... ఆ విషయం తెలిసి నటులుగా తామంతా సంతోషించామని చెప్పారు. మరోపక్క, ఇదే రకమైన విమర్శలను దర్శకుడు అనిల్ రావిపూడి కూడా చేశారు. కొందరు పనికట్టుకుని నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని మండిపడ్డారు.