స‌ర్కారీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.1 కోటి ఇచ్చిన టీఆర్ఎస్ ఎంపీ

  • చేవెళ్ల‌లో కొత్త‌గా 30 ప‌డ‌క‌ల‌తో స‌ర్కారీ ఆసుప‌త్రి
  • రూ.1.55 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని తేల్చిన అధికారులు
  • రూ.1 కోటి ఇస్తానంటూ ముందుకు వ‌చ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి
ప్రజా సంక్షేమం నిమిత్తం చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు త‌మ సొంత నిధుల‌ను వెచ్చించే రాజ‌కీయ నేత‌లు అతి కొద్ది మందే ఉంటారు. అలాంటి వారిలో టీఆర్ఎస్‌కు చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఒక‌ర‌ని చెప్పాలి. త‌న నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలో నూత‌నంగా నిర్మిస్తున్న స‌ర్కారీ ద‌వాఖానాకు ఆయ‌న ఏకంగా రూ.1 కోటిని అందించేందుకు సిద్ధ‌ప‌డ్డారు. ఈ మేర‌కు ఆయ‌న తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ క‌మిష‌న‌ర్‌కు ఓ లేఖ కూడా రాశారు.

చేవెళ్ల ప‌రిధిలో కొత్త‌గా నిర్మిస్తున్న 30 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి నిర్మాణానికి రూ.1.55 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని అధికారులు తేల్చారు. ఈ నిధుల్లో త‌న వాటాగా రూ.1 కోటిని అందించ‌నున్న‌ట్లు రంజిత్ రెడ్డి తెలిపారు. ఈ విష‌యాన్ని టీఆర్ఎస్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆసిఫ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. ఈ దిశగా వైద్య విధాన ప‌రిష‌త్ క‌మిష‌న‌ర్‌కు రంజిత్ రెడ్డి రాసిన లేఖ‌ను కూడా ఆసిఫ్ త‌న ట్వీట్‌కు జ‌త చేశారు.


More Telugu News