ఆఫ్ఘనిస్థాన్ లో మరింత పెరిగిన భూకంప మృతుల సంఖ్య
- పక్తికా, ఖోస్త్ ప్రాంతాల్లో భారీ భూకంపం
- రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదు
- 950 మందికి పైగా మృతి
- 600 మందికి పైగా గాయాలు
ఈ ఉదయం ఆఫ్ఘనిస్థాన్ లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 950కి పెరిగింది. 600 మందికి పైగా గాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్ లోని పక్తికా ప్రావిన్స్, ఖోస్త్ ప్రాంతాల్లో అత్యధిక మరణాలు సంభవించాయి. 2002 తర్వాత ఆఫ్ఘనిస్థాన్ ను కుదిపేసిన భూకంపం ఇదే.
కాగా, భూకంపంలో పెద్ద సంఖ్యలో ప్రజలు మృతి చెందడం పట్ల తాలిబన్ సుప్రీం నేత హిబాతుల్లా అఖుంద్ జాదా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కాగా, ఈ భూకంప ప్రభావం ఆఫ్ఘనిస్థాన్ తో పాటు పాకిస్థాన్, భారత్ లోని కొన్ని భూభాగాల్లోనూ కనిపించినట్టు గుర్తించారు. అయితే పాకిస్థాన్, భారత్ లో భూకంప నష్టం వివరాలు తెలియరాలేదు.