శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోంది: సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

  • మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం
  • బీజేపీపై కత్తులు దూస్తున్న విపక్షాలు
  • పెరుగుతున్న షిండే క్యాంపు బలం
  • రెబల్ ఎమ్మెల్యేలతో చేరిన మరో ఇద్దరు
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మంది రెబల్ లీడర్ ఏక్‌నాథ్ షిండే గూటికి చేరడంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సహా ఆ పార్టీ అగ్రనాయకత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. షిండేకు ప్రస్తుతం 47 మంది శాసనసభ్యుల మద్దతు ఉంది. వీరిలో 37 మంది సేన ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం. ఉద్ధవ్ థాకరే‌కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 13-17కు పడిపోయింది. 
 
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోందని ఆరోపించారు. కాగా, రెబల్ ఎమ్మెల్యేల బలం మరింత పెరిగింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ గూటికి చేరారు. రెబల్ క్యాంపునకు క్యూకడుతున్న ఎమ్మెల్యేలను చూస్తుంటే ఈ రోజే షిండే క్యాంపు బలం 50కి చేరుకునేలా ఉంది. అదే జరిగితే ఉద్ధవ్ ప్రభుత్వం నేడే అస్త్రసన్యాసం చేయకతప్పదు.


More Telugu News