వైసీపీ ప్లీనరీలో ఫొటో గ్యాలరీ ఏర్పాట్లలో నిండా మునిగిపోయిన పేర్ని నాని
- రెండు రోజుల పాటు జరగనున్న వైసీపీ ప్లీనరీ
- వైఎస్సార్ ప్రస్థానంపై ఫొటో గ్యాలరీ
- గ్యాలరీ ఏర్పాట్లలో రాత్రి తలమునకలైన పేర్ని నాని
ఏపీలో అధికార పార్టీ వైసీపీ మూడో ప్లీనరీ సమావేశాలు శుక్రవారం గుంటూరు జిల్లా పరిధిలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రెండు రోజుల పాటు జరిగే ప్లీనరీని ప్రారంభించారు.
మచిలీపట్నం ఎమ్మెల్యేగా విజయం సాధించి జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని) అయితే రాత్రి పొద్దుపోయే దాకా కూడా ప్లీనరీ ఏర్పాట్లలోనే మునిగిపోయారు. ప్లీనరీలో భాగంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రస్థానం, వైసీపీ ఎదిగిన తీరు, జగన్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పాలనను ప్రతిబింబించేలా ప్లీనరీలో ఫొటో గ్యాలరీ ఏర్పాటు అయ్యింది.
ఈ ఫొటో గ్యాలరీ ఏర్పాట్లలో నిమగ్నమైన పేర్ని నాని... నిన్న రాత్రి పొద్దుపోయే దాకా ప్లీనరీ వేదిక వద్దే ఉండిపోయారు. తన సహాయకులతో కిందే కూర్చుని ఫొటోల ఎంపికలో నిమగ్నమైన ఆయన ఫొటోలను పార్టీకి చెందిన ఓ నేత సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.