అఖిలేశ్ నుంచి విడాకుల కోసం ఎదురుచూస్తున్నా.. ఎస్బీఎస్పీ చీఫ్ రాజ్‌భర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఉప ఎన్నికల్లో ఓటమిపాలైన ఎస్పీ
- రెండు లోక్ సభ స్థానాల్లోనూ ఎస్పీ ఓటమి
- ఫలితాల అనంతరం ఎస్పీతో మిత్రపక్షాల దూరం
- అఖిలేశ్‌కు ఇష్టం లేకపోతే ఎస్పీతో కలిసి ఉండబోమన్న రాజ్‌భర్
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి ఫలితాలు ఉత్తరప్రదేశ్‌లోని విపక్ష కూటమిలో కలతలను సృష్టించే దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉప ఎన్నికల్లో భాగంగా సమాజ్ వాదీ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన రాంపూర్, అజంగఢ్ లోక్ సభ స్థానాలకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు చోట్ల సమాజ్ వాదీ పార్టీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎస్పీతో కలిసి సాగుతున్న పార్టీల్లో ఒకటైన సహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికీ సమాజ్‌వాదీ పార్టీతోనే కలిసి ఉన్నామని, అయితే అఖిలేశ్ యాదవ్‌కు ఇష్టం లేకపోతే ఆ పార్టీతో బలవంతంగా కలిసి ఉండబోమని ఆయన వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన అఖిలేశ్‌తో తాను విడాకుల కోసం ఎదురు చూస్తున్నానని కూడా రాజ్‌భర్ వ్యాఖ్యానించారు.