భారీ రేటుకు 'లైగర్' శాటిలైట్ రైట్స్!
- పూరి నుంచి మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్
- బాక్సర్ గా కనిపించనున్న విజయ్ దేవరకొండ
- కీలకమైన పాత్రలో నటించిన రమ్యకృష్ణ
- ఆగస్టు 25వ తేదీన విడుదల
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమా రూపొందింది. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమాకి కరణ్ జొహార్ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో నడిచే ఈ కథలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు.
ఈ సినిమాను తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఇటీవల వదిలిన ట్రైలర్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాపై గల క్రేజ్ కారణంగా శాటిలైట్ .. డిజిటల్ రైట్స్ కలుపుకుని 55 కోట్లు పలికినట్టుగా చెబుతున్నారు.
ఈ సినిమాతో తెలుగు తెరకి అనన్య పాండే కథానాయికగా పరిచయమవుతోంది. ట్రైలర్ లో హీరో పాత్రకి తల్లిగా రమ్యకృష్ణ మాస్ లుక్ తో కనిపించడం అందరిలో అంచనాలు పెంచింది. ఇక మైక్ టైసన్ గెస్టు రోల్ లో కనిపించనుండటం ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఈ సినిమా మరో సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.