ఫిలిప్స్ నుంచి రూ.లక్ష విలువ చేసే ప్రీమియం టీవీ
- 7900 యాంబిలైట్ సిరీస్ విస్తరణ
- మూడు టీవీలను ప్రవేశపెట్టిన ఫిలిప్స్
- రూ.99,990నుంచి ధరలు ప్రారంరభం
ఫిలిప్స్ కంపెనీ ప్రీమియం స్మార్ట్ టీవీలను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 4కే రిజల్యూషన్ తో మూడు రకాలను 7900 సిరీస్ కింద ప్రవేశపెట్టింది. వీటిల్లో త్రీవే యాంబిలైట్ టెక్నాలజీని వినియోగించింది. టీవీలోని ఎల్ఈడీ బల్బుల సాయంతో యాంబియంట్ లైటింగ్ విడుదలవుతుంది. ఈ లైటింగ్ టెక్నాలజీ అన్నది చక్కని వీక్షణా అనుభవాన్ని ఇస్తుందని ఫిలిప్స్ కంపెనీ ప్రకటించింది.
ఫిలిప్స్ 7900 యాంబిలైట్ టీవీ 55 అంగుళాల తెర ధర రూ.99,990. 65 అంగుళాల స్క్రీన్ టీవీ ధర రూ.1,49,990. 70 అంగుళాల ధర రూ.1,89,990. ఇవి దేశవ్యాప్తంగా ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులోకి వస్తాయి. ఆన్ లైన్ లో ఎక్కడ విక్రయించేంది ఫిలిప్స్ ప్రకటించలేదు. ఆండ్రాయిడ్10ఓఎస్ తో ఈ టీవీ పనిచేస్తుంది. టీవీకి బ్రాడ్ బ్యాండ్ అనుసంధానించడం ద్వారా అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ లను యాక్సెస్ చేసుకోవచ్చు.