‘మాషుకా’తో మెస్మరైజ్ చేస్తున్న రకుల్ ప్రీత్
- ప్రియుడితో కలిసి ప్యాన్ ఇండియా మ్యూజిక్ వీడియో చేసిన రకుల్
- ఇప్పటికే హిందీలో విడుదలై హిట్ అయిన పాట
- తాజాగా తెలుగు, తమిళ్ వెర్షన్స్ విడుదల చేసిన అల్లు అర్జున్
టాలీవుడ్ ద్వారా తెరంగేట్రం చేసిన రకుల్ తెలుగులో చాన్నాళ్లు అగ్ర హీరోయిన్ గా వెలుగొందింది. పలువురు స్టార్ హీరోల సరసన నటించిన ఆమె ఈ మధ్యలో తెలుగులో స్పీడు తగ్గించింది. అదే సమయంలో తమిళ్, హిందీలో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ఇంత బిజీలోనూ రకుల్ ఒక ప్యాన్ ఇండియా మ్యూజికల్ వీడియో చేసింది. రకుల్ ప్రియుడు, ఆమెకు కాబోయే భర్త జాకీ భగ్నాని దీన్ని నిర్మించారు. ‘మాషుకా’ అంటూ సాగే ఈ పాట హిందీ వెర్షన్ ఇప్పటికే విడుదలైంది.
తాజాగా నిన్న తెలుగు, తమిళ వెర్షన్స్‌ని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో లాంచ్ చేశాడు. తనిష్క్ బాగ్చి సంగీతం అందించిన ఈ పాటను తెలుగులో ఆదిత్య అయ్యంగార్, అసీస్ కౌర్ పాడారు. ‘నీ నవ్వుకు పడిపోయా, నీ చూపుకు పడిపోయా, నా నిదరే చెడిపోయా’ అంటూ సాగే తెలుగు పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. ఇందులో స్టయిలిష్ లుక్ లో కనిపించిన రకుల్ చక్కటి స్టెప్పులతో అలరించింది.
మరోపక్క, రకుల్ హీరోయిన్ గా నటించిన హిందీ చిత్రాలు ‘అటాక్’, ‘రన్‌వే 34’ ఈ మధ్యే విడుదలై బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఆమె హిందీలో ‘మిషన్ సిండ్రెల్లా’, ‘డాక్టర్ జి’, ‘థ్యాంక్ గాడ్’, ‘ఛత్రీవాలీ’ అనే సినిమాల్లో నటిస్తోంది. అదే సమయంలో శివ కార్తికేయన్ సరసన నటించిన తమిళ చిత్రం ‘అయలాన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. .