తెలంగాణ మీదుగా విస్తరించిన ఉపరితల ద్రోణి.. నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

  • 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి
  • చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కొమరిన్ వరకు విస్తరించిన ద్రోణి
  • రాష్ట్రంలో సాధారణంగానే రుతుపవనాల కదలికలు
తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని, వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీనికి తోడు ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య గాలులతో 900 మీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్నట్టు వివరించింది. 

నిన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లాలోని మామడలో 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా వికారాబాద్ జిల్లా పెద్దమంతాల్‌లో 5.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.


More Telugu News