ప్రతిఘటించిన ప్రియాంకా గాంధీ.. కాళ్లూ చేతులు పట్టి లాక్కెళ్లిన పోలీసులు... వీడియో ఇదిగో
- ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళనలకు ముందు నిలిచిన ప్రియాంక
- పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్‌ను దూకేసిన వైనం
- ఎట్టకేలకు ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ధరల పెరుగుదల. ఈడీ కేసులతో విపక్షాలను బెంబేలెత్తిస్తున్న బీజేపీ సర్కారు వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం చేపట్టిన ఆందోళనల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్న పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా పార్టీ శ్రేణులను ముందుండి నడిపించారు. ఈ క్రమంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్‌ను దూకిన ప్రియాంకా గాంధీ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ముందుకు సాగిన ప్రియాంకను అదుపు చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. ఓ క్రమంలో ఆమె పోలీసులనే తోసేసి ముందుకు సాగారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ప్రియాంకను నిలువరించగా ఆమె రోడ్డుపై బైఠాయించారు. అనంతరం ఆమెను కాళ్లు, చేతులు పట్టుకుని తరలించారు. ఈ సందర్భంగానూ ప్రియాంక పోలీసులను తీవ్రంగానే ప్రతిఘటించారు. ఇలా ప్రియాంక కాళ్లు చేతులు పట్టుకుని పోలీసులు ఆమెను లాక్కెళ్లిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.