పచ్చళ్ల స్వాతిగా పాయల్ రాజ్ పుత్

  • మంచు విష్ణు జిన్నా సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పాయల్
  • తన పాత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన చిత్ర బృందం
  • జిన్నా తోడుదొంగ స్వాతి అంటూ పాయల్ ట్వీట్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘జిన్నా’. చాలా కాలంగా వరస ఫ్లాప్స్ లో ఉన్న విష్ణు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. విష్ణు సినిమా కోసం అతని అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గాలి నాగేశ్వరావు అనే పాత్రలో విష్ణు కనిపించనున్నాడు. ఈషాన్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. 

రచయిత కోన వెంకట్‌ కథ, కథనం అందించడంతో పాటు ఈ చిత్రానికి క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మంచు విష్ణు ఫస్ట్‌ లుక్‌ వీడియోకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ‘ఆర్ ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది. సన్నీ లియోన్‌ కీలక పాత్ర పోషిస్తోంది. 

తాజాగా ఈ చిత్రంలో పాయల్  ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. విష్ణు సరసన పాయల్ పచ్చళ్ల స్వాతి పాత్రలో కనిపించనుంది. లంగా ఓణీలో వయ్యారంగా చూస్తున్న పాయల్ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఆ పోస్టర్ ను తన ట్విట్టర్ అకౌంట్లో పాయల్ షేర్ చేసింది. ‘ప్రతి ఒక్కరి జీవితంలో ఓ ఫ్రెంచ్ కావాలి. అతని కొంటె పనుల్లో పాలు పంచుకోవాలి. జిన్నా తోడుదొంగ స్వాతిని పరిచయం చేస్తున్నా’ అని పాయల్ ట్వీట్ చేసింది.


More Telugu News