ఛార్మీ నాకు 13 ఏళ్ల వయసు నుంచే తెలుసు: పూరీ జగన్నాథ్

  • ఛార్మీకి, పూరీ జగన్నాథ్ కు మధ్య ఏదో ఉందంటూ పుకార్లు
  • ఛార్మీ యంగ్ గా ఉండటం వల్లే ఈ పుకార్లు అన్న పూరీ జగన్నాథ్
  • ఆకర్షణ కొద్ది రోజుల్లోనే చచ్చిపోతుందని వ్యాఖ్య
పంజాబీ ముగ్గుగుమ్మ ఛార్మీ తెలుగులో ఎన్నో హిట్ సినిమాలలో నటించి... అగ్ర హీరోయిన్లలో ఒకరిగా చెలామణి అయింది. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో... దర్శకుడు పూరీ జగన్నాథ్ తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. మరోవైపు ఛార్మీ, పూరీ జగన్నాథ్ ల సాన్నిహిత్యాన్ని చూసి ఇద్దరి మధ్య ఏదో ఉంది అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇప్పటికీ జనాలు అదే భావనలో ఉన్నారు. ఛార్మీ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. మరోవైపు పూరీ జగన్నాథ్ కు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు ఆకాశ్ పూరీ ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా నటించాడు. 

ఈ నేపథ్యంలో, పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాన్ని పూరి జగన్నాథ్ చేశాడు. తాజాగా 'లైగర్' సినిమా ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతూ... ఛార్మీ తనకు 13 ఏళ్ల వయసప్పటి నుంచి తెలుసని చెప్పారు. రెండు దశాబ్దాలుగా ఆమెతో కలిసి పని చేస్తున్నానని అన్నారు. 

ఛార్మీ ఒక 50 ఏళ్ల మహిళ అయితే ఎవరూ పట్టించుకునే వారు కాదని... ఆమెకు వేరే వారితో పెళ్లి జరిగినా పట్టించుకునే వారు కాదని... ఆమె ఇంకా యంగ్ గా ఉండటం వల్లే అఫైర్ ఉందని, అదీ ఇదీ అంటూ ఏదేదో మాట్లాడుకుంటున్నారని చెప్పారు. ఒకవేళ అఫైర్ ఉన్నా అది ఎక్కువ రోజులు నిలబడదని అన్నారు. ఆకర్షణ అనేది కొన్ని రోజుల్లోనే చచ్చిపోతుందని... స్నేహమే శాశ్వతమని చెప్పారు. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని అన్నారు.


More Telugu News