కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆజాద్‌కు గ్రీటింగ్స్ చెప్పిన విజయసాయిరెడ్డి
- శుక్రవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆజాద్
- ఇప్పటికైనా ఆజాద్‌కు స్వేచ్ఛ లభించిందన్న సాయిరెడ్డి
- ఆజాద్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కితాబు
కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ శుక్రవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆజాద్ రాజీనామాపై విచారం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తే... ఇతర పార్టీల నేతలు ఈ వ్యవహారంపై అంతగా స్పందించలేదు. అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆజాద్ రాజీనామాపై వేగంగా స్పందించారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆజాద్‌కు ఆయన ఏకంగా అభినందనలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా సాయిరెడ్డి ఓ పోస్ట్ పెట్టారు.
'నెహ్రూ వంశం 'గులామి' (బానిసత్వం) నుంచి చిట్టచివరకు ఆయన ఆజాది (స్వేచ్ఛ)ని పొందారు' అని సాయిరెడ్డి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆజాద్ తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనదని సాయిరెడ్డి కీర్తిస్తూ.. మీ మనస్సాక్షి మాట వినడంలో ఆలస్యమేమీ కూడా కాలేదంటూ పేర్కొన్నారు.