బాలీవుడ్ రిలీజ్ కి రెడీ అవుతున్న 'సీతా రామం'

  • ఈ నెల 5వ తేదీన విడుదలైన 'సీతా రామం'
  • తెలుగులో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 
  • తమిళ .. మలయాళ భాషల్లోను మంచి వసూళ్లు 
  • వచ్చేనెల 2వ తేదీన హిందీలో విడుదల
'సీతా రామం' .. ఈ నెల 5వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్ .. మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాలో, కీలకమైన పాత్రలో రష్మిక నటించింది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో అదే రోజున ఈ సినిమా విడుదలైంది. 

తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి, ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి ప్రేమకథగా మార్కులు కొట్టేసింది. తమిళ .. మలయాళ భాషల్లో కూడా చెప్పుకోదగిన వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించడానికి రెడీ అవుతోంది.

సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమా హిందీ వెర్షన్ విడుదలవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ ప్రేక్షకులు ఈ తరహా ప్రేమకథలను ఎక్కువగా ఇష్టపడతారు. అందునా వాళ్లకి దుల్కర్ .. రష్మికతో పాటు మృణాల్ కూడా బాగా తెలుసు. అందువలన మరింత త్వరగా ఈ కథ వాళ్లకి కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


More Telugu News