సిక్కుల తలపాగా ధరించిన కేసీఆర్... బీహార్ టూర్‌లో కొత్త లుక్కులో తెలంగాణ సీఎం
- బీహార్ పర్యటనలో కేసీఆర్
- తేజస్వీ యాదవ్‌తో కలిసి గురుద్వారా వెళ్లిన తెలంగాణ సీఎం
- గులాబీ రంగు తలపాగాతో కనిపించిన కేసీఆర్
బీహార్ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం బిజీబిజీగా గడిపారు. బుధవారం మధ్యాహ్నం బీహార్ రాజధాని పాట్నా చేరుకున్న కేసీఆర్.... ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లతో కలిసి గల్వాన్ లోయ అమర వీరుల కుటుంబాలకు పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం జాతీయ రాజకీయాలపై వారితో చర్చలు జరిపిన కేసీఆర్... తదనంతరం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో భేటీ అయ్యారు.
ఆ తర్వాత బుధవారం సాయంత్రం బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌తో కలిసి పాట్నాలోని గురుద్వారాను సందర్శించారు. ఈ సందర్భంగా సిక్కులు ధరించే తలపాగా ధరించిన కేసీఆర్...న్యూ లుక్కులో కనిపించారు. తన పార్టీ జెండా రంగు అయిన గులాబీ రంగు తలపాగాను ధరించిన కేసీఆర్ గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిక్కుల తలపాగాలో కనిపించిన కేసీఆర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.