ఇది సరైన టైమ్ కాదు .. బరి నుంచి తప్పుకున్న యంగ్ హీరో!

  • ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'
  • కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన సినిమా 
  • దర్శకుడిగా శ్రీధర్ గాదె పరిచయం 
  • సెప్టెంబర్ 16కి వాయిదా పడే అవకాశం  
వచ్చే శుక్రవారం .. అంటే సెప్టెంబర్ 9వ తేదీన మూడు సినిమాలు విడుదల కానున్నట్టుగా ప్రకటించారు. రణ్ బీర్ కపూర్ - అలియా భట్ కాంబినేషన్లో రూపొందిన 'బ్రహ్మాస్త్రం' సినిమాను ఆ రోజున భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. తెలుగులో రాజమౌళి సమర్పిస్తున్న ఈ సినిమా కోసం అత్యధిక థియేటర్లను కేటాయించారు. 

ఇక అదే రోజున శర్వానంద్ హీరోగా చేసిన 'ఒకే ఒక జీవితం' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమా, మదర్ సెంటిమెంట్ తో కూడిన టైమ్ ట్రావెల్ నేపథ్యంలో కొనసాగనుంది. అదే రోజున 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమాను విడుదల చేస్తున్నట్టుగా ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. 

కానీ ఇప్పుడు ఈ సినిమా బరి నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 16వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. కోడి దివ్య నిర్మించిన ఈ సినిమాకి శ్రీధర్ గాదె దర్శకత్వం వహించాడు.


More Telugu News