ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు
- వానల తీరుపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన
- ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడి
- ఉపరితల ద్రోణి కొనసాగుతుండటమే కారణమని వివరణ
దేశంలో మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ఉత్తర –దక్షిణ ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వచ్చే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. కొన్నిచోట్ల ఓ మోస్తరు వానలు పడతాయని వివరించింది.
తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వివరించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు వీస్తున్నాయని.. దీని ప్రభావంతో వానలు పడతాయని వివరించింది.