తెలంగాణ‌లో కొత్త‌గా 13 రెవెన్యూ మండ‌లాల ఏర్పాటు

  • సిద్దిపేట జిల్లాలో అత్య‌ధికంగా 3 కొత్త మండలాలు
  • జ‌గిత్యాల‌, మ‌హ‌బూబాబాద్‌, నిజామాబాద్ జిల్లాల్లో రెండేసి కొత్త మండ‌లాలు
  • ఉత్త‌ర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్ కుమార్‌
ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత తెలంగాణ‌లో పాల‌నా సౌల‌భ్యం కోసం కేసీఆర్ స‌ర్కారు ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజ‌న్లు, కొత్త మండ‌లాల‌ను ఏర్పాటు చేస్తూ సాగిన టీఆర్ఎస్ స‌ర్కారు.. తాజాగా రాష్ట్రంలో మ‌రో 13 రెవెన్యూ మండ‌లాల‌ను ఏర్పాటు చేస్తూ సోమ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

సోమ‌వారం కొత్త మండ‌లాలుగా ఏర్పాటైన వాటిలో భీమారం, ఎండ‌వ‌ల్లి (జ‌గిత్యాల జిల్లా), నిజాంపేట్ (సంగారెడ్డి జిల్లా), గ‌ట్టుప్ప‌ల్ (న‌ల్ల‌గొండ జిల్లా), సీరోలు, ఇనుగుర్తి (మ‌హ‌బూబాబాద్ జిల్లా), కౌకుంట్ల (మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా), అక్బ‌ర్ పేట్‌, భూంప‌ల్లి, కుకునూర్‌ప‌ల్లి (సిద్దిపేట జిల్లా), డోంగ్లీ (కామారెడ్డి జిల్లా), ఆలూర్‌, డొంకేశ్వ‌ర్‌ సాలూరా (నిజామాబాద్ జిల్లా) ఉన్నాయి. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ తుది నోటిఫికేష‌న్ జారీ చేశారు.


More Telugu News