పర్యాటకంలో నాలుగు అవార్డులు గెలుచుకున్న తెలంగాణ
- నాలుగు విభాగాల్లో సత్తా చాటిన తెలంగాణ
- బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీగా అపోలో ఆసుపత్రికి అవార్డు
- హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌కు బెస్ట్ గోల్ఫ్ కోర్స్ అవార్డు
- ఉపరాష్ట్రపతి నుంచి అవార్డులు అందుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
కొత్త రాష్ట్రమైనా తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. పర్యాటక రంగంలో విశేష వృద్ధిని సాధించిన తెలంగాణ నేషనల్ టూరిజం అవార్డుల్లో సత్తా చాటింది. వివిధ విభాగాలతో కలిపి మొత్తం 4 అవార్డులను తెలంగాణ దక్కించుకుంది. ఈ మేరకు ప్రపంచ పర్యాటక దినోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ నుంచి రాష్ట్ర పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవార్డులను స్వీకరించారు.
తెలంగాణ సాధించిన అవార్డుల విషయానికి వస్తే.. పర్యాటక ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇక బెస్ట్ గోల్ఫ్ కోర్స్ అవార్డు కూడా తెలంగాణకే దక్కింది. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌కు ఈ అవార్డు వచ్చింది. ఉత్తమ రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంపిక కాగా... బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీగా హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రి ఎంపికైంది.